Dear........
Dear............... నిన్ను చుసిన మొదటి క్షణం లోనే ఇంకా కాలాన్ని క్షణాలో కొలుస్తారు అని గుర్తువచ్చింది ,ఎప్పటినుంచో రాస్తున్న నాకే నిన్ను చుసిన మొదటి క్షణం లో మాటలు రావడమే మానేశాయి ,వెన్నల వెలుతురుని ఇస్తుంది అనేది అమావాస్య వస్తే కానీ తెలియలేదు ప్రేమ ఆనందాన్ని కూడా ఇస్తుందని నువ్వు పరిచయం అయ్యే వరుకు అర్ధం కాలేదు . ఏరోజు నిన్ను చూశానో మొదటిసారి దగ్గరనుంచి ఓ దేవతను చూసాను అనిపించింది.నవ్వుకు నడక వచ్చి, అందానికి రూపం ఇచ్చి రెండింటినీ కలిపి ఊపరిపోసి జీవం వస్తే నీలా ఉంటుందేమో అనిపించింది.నిన్ను పొగడాలంటే అక్షరాలు కూడా అలంకరించుకుని ముస్తాబవ్వాల్సిందే అనిపిస్తుంది .కలం కూడా కొత్త పదాల కోసం ప్రపంచ యాత్ర తప్పదనిపించింది.అందాల పోటీకి నీ ఫోటో పంపినా మిస్ యూనివర్స్ కిరీటం నీకు కొరియర్లో పంపించేస్తారు అనిపిస్తుంది.వేద కాలంలో ఋషులు కూడా బ్రహ్మచర్యం వదిలి నీ కోసం తపస్సు చేస్తారు అనిపిస్తుంది.స్వయంవరం ఇప్పుడు పెడితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అనిపిస్తుంది.ఏదన్నా ఎక్కువ ఇష్ట పడితే దానిమీద ప్రేమ పెరుగుతుంది అంటారు గా ఎంత ఇష్టపడనో చెప్పలేను క...